కలుపుమొక్కలు

కలుపుమొక్కలు తీసివేస్తే ఫలసాయం పెరిగినట్లే
చెడు ఆలోచనలు చెరిపివేస్తే
మనసుకి శాంతి సంతోషం కలుగుతాయి

కలుపుమొక్కలు

కలుపుమొక్కలు

తెలుసా????

రాగం లేని తీగెను ఎంత మీటినా
తీపి రాగం పలుకుతుందా
పాశవిక హృదయులకి
పసిపాప హృదయ వేదన అర్ధమవుతుందా
పంకిలం పంకజాన్ని పలకరించగలదా
మిణుగురు పురుగు భానుని వెలుగును వెక్కిరించగలదా
కసిగా నలిపే పాదాలకు తెలుసా
కుసుమపు కోమలత్వం
అహానికి తెలుసా
సున్నితత్వపు సుందర స్వప్నాలు
కరుకుదనానికి తెలుసా
కమ్మని కలల కమనీయ దృశ్యాలు
కాఠిన్యానికి తెలుసా
కన్నుల్లో కదిలే అశృవుల అలజడి
నిశిరాతిరి నీడలకేం తెలుసు
వెలుగు పువ్వుల ఒంటరి వేదన
శరీరమే శాశ్వతమనుకునే
పశుత్వానికి తెలుసా
అంతరంగపు ఆత్మీయ ఆరాటం

తెలుసా????

తెలుసా????

ఆశగా ఉంది

నిన్ను చూడాలని
నీ సన్నిధి చేరాలని
మువ్వనై
సిరిమువ్వనై
నీ చెంత మ్రోగాలని
నీ వెంట ఉండాలని
నీ కంట నిండాలని
నీ కోసం కనులు మూయాలని
త్వర త్వరగా బ్రతుకు ముగించుకుని
నీ బృందావనం చేరాలని
ఆశ గా ఉంది కృష్ణయ్యా

Meerabhai

Meerabhai

నా అనంతునికో అక్షరమాల (ఏ)

ఏడ్పించకు ప్రభూ

ఏడనున్నావు ప్రియ బాంధవా
ఏడ్చే ఎదకు ఎదురవ్వవా
ఏమార్చి పోయావు
ఏల రాకున్నావు ఇంతసేపూ
ఏడుకొండలూ ఎక్కలేను
ఏడేడు జన్మలూ ఎదురు చూడలేను
ఏనాటికైనా నీ దరి చేరాల్సిందే
ఏలికవనే కదా నిన్నల్లుకున్నది
ఏడ్పించక నీ ఎద చేర్చుకో

రాధాకృష్ణుల ప్రేమకథ

నా అనంతునికో అక్షరమాల (ఏ)

నా అనంతునికో అక్షరమాల (ఏ)

ఎదురు చూస్తున్నా

ఎదురు చూస్తున్నా

ఎదురు చూస్తున్నా

ఎదురు చూస్తున్నా

18 Shakthi Peetaalu

ఎదురు చూస్తున్నా

నిన్నే నిన్నే తలచుకుంటూ
తీవ్ర తపనతో
తపిస్తూ జపిస్తూ
నీ తలపుల్లో తరిస్తూ
తరుగుతున్న కాలాన్ని తిట్టుకుంటూ
దిగుళ్ళ గుబుళ్ళతో
దైన్యంగా
కాలాన్ని దొర్లిస్తూ
నిన్నే నిన్నే ద్యానిస్తూ
క్షోభిస్తూ
క్షణాలు దొర్లిస్తూ
తొలకరి పలకరింపై వస్తావని
బీడైన ఎడారి గుండెతో
ఎదురు చూస్తున్నా

జాగరణ

ప్రభూ
నిద్రమత్తు మాయలా ఆవహిస్తుంది
అయినా
నీ తలపుల తపనలు
నీ జపాల తపాలు
తనవి తీరని మనసు నిండని
నీ మాధుర్యపు మురిపాలు
అనంతపు ఆరాటాల ఆలాపనలు
మనస్సు మరీ మరీ చెప్తుంది
నిద్ర వద్దు
నీ తోనే ఉండమంటుంది
నీ జ్ఞాపకాల జాగరణ చేయమంటుంది

బ్రహ్మానందస్వరూపానివి

బ్రహ్మానందస్వరూపానివి

బ్రహ్మానందస్వరూపానివి

నువ్వు బ్రహ్మానందస్వరూపానివి
ఏ భావమూ లేని ప్రశాంత చిత్తమే నీ స్వభావము
ఆ స్వభావాన్ని సందేహాలతో అస్థిర చిత్తముతో
సంఘర్షించనివ్వకు

నా అనంతునికో అక్షరమాల (ఎ )

నల్లనయ్యవు నువ్వు

ఎదలరొదలసొదలలో
ఎరుకలలో
ఎదనిండిన ఆనందాలలో
ఎల్లలు లేని ప్రేమ వెల్లువలలో
ఎలుగెత్తే సత్యపు సంకీర్తనలలో
ఎండమావుల్లాంటి ఆశ నిరాశలలో
ఎవ్వరెరుగని అలౌకిక లోకాలలో
ఎవ్వరూ చేరలేని చల్లని మాధుర్యపు
ఎత్తైన శిఖరపు నివాసాలలో
నిలచి ఉన్న నల్లనయ్యవు నువ్వు

నా అనంతునికో అక్షరమాల (ఎ )

నా అనంతునికో అక్షరమాల (ఎ )

వెన్నెలయ్యా

గతితప్పిన మనస్సులకు
మతి తప్పిన మనుగడలకు
శృతి తప్పిన పాటలకు
అణిగిపోయిన అహానికి
అలకబూనిన ఆరాటాలకి
ఆశ్రయించే నయనాలకి
అలసిన అంతరంగాలకి
వెలసిపోయిన బ్రతుకులకు
వలసపోయిన వసంతానికి
వెళ్ళిపోయిన వెన్నెలకు
విస్తుపోయే వాస్తవాలకి
వెగటైన వేదనలకి
ఒంటరి గుండెలకి
ఓడిన విషాదానికి
ఓదార్పు నిచ్చే
వైకుంఠ వాసివి
నువ్వే కదా వెన్నెలయ్యా

వెన్నెలయ్యా

వెన్నెలయ్యా

నేనే లేనుగా

స్మృతులన్నీ శిధిలశకలాలు
కలలు కమురుకంపు కొట్టే కాలీ కాలని కట్టెబొగ్గులు
రగిలి రగిలి ఆరిన ఆశలు
నిన్న మొన్న
అందమని
ఆకర్షణ అని
అనురాగమని
అనుబంధాలని
ప్రాకులాడి పోషించిన
శరీరమేమిటి
ఉత్తి బూడిదైంది
నేనే కదూ ఆ బూడిద కుప్ప
నేనే లేనుగా

నేనే లేనుగా

నేనే లేనుగా

-----------------------------------

ఆవేశాలు ఆశలు నిరీక్షణలు భయాలు వీటి ఊగిసలాటల నుండి మనస్సుని విముక్తి గావించుకుని నిశ్చలంగా ఉంచుకోవాలి
దీనిని సాధించడంలో ఎంతగా సఫలీకృతం అవుతామో అంతగా అంతర్వాణి ని వినడం లో విజయవంతం అవుతాము
అప్పిడిక తప్పులు దోషాలే ఉండవు

---------------------------------------

---------------------------------------

విషపూరిత జీవిత వృక్షములో

ఈ విషపూరిత జీవిత వృక్షములో
రెండు మంచి ఫలాలు ఉన్నాయి
అమరత్వం గురించి ద్యానించడం
ఋషులతో సంభాషించడం

విషపూరిత జీవిత వృక్షములో

విషపూరిత జీవిత వృక్షములో

కృష్ణ నివేదనం

కృష్ణ నివేదనం

కృష్ణ నివేదనం

చలన రహిత పాషాణాన్నై పరవశించనివ్వు
శరీర రహిత సౌభాగ్యాన్నై శోభించనివ్వు
వాంచారహిత విహంగాన్నై విహరించనివ్వు
కలలు కలతలు లేని కమ్మని నిద్రలా కరిగిపోనివ్వు
దు;ఖ రహిత ధూపాన్నై ధరిత్రినంతా దీవించనివ్వు
కృష్ణసహిత భావనలోనే బ్రతకనివ్వు
వికృతి లేని ప్రకృతిలో పరవశించనివ్వు
వికారాలు లేని స్వచ్చలోకంలోనికి సాగిపోనివ్వు
సదా సతతమూ నీ స్మరణలోనే సోలిపోనివ్వు
స్థిరచిత్తపు శిలనై నీ సన్నిధిలో సేదతీరనివ్వు
పవిత్రాత్మనై నీ పరంధామలోకం లో ప్రవేశించనివ్వు

శాశ్వత నిధులు

ఆకాశం నాలాగే భోరుమంటుంది
ఆగకుండా వర్షిస్తుంది వర్షంలా
గుండె కూడా చిల్లుపడినట్టు
అశృవులను రాలుస్తుంది చినుకు చినుకు గా
కలలున్నది కరగడానికే
ఆశలున్నది వలసవెళ్ళడానికి
ప్రేమన్నది ప్రాణం అల్లాడటానికి
పాశమున్నది శోకించడానికి
స్వప్నాలన్నీ సమాప్తమయ్యాయి
శిధిలాలే శాశ్వత నిధులవుతున్నాయి

శాశ్వత నిధులు

శాశ్వత నిధులు

నన్ను ఉండనివ్వు

కర్కశులు
కఠినులు
కరుకుదనపు హృదాయాలున్న చోటకనులు విప్పలేకున్నాను కన్నయ్యా
ఈ వికారపు వికృతలోకంలో
విషం చిమ్మే వ్యక్తులమద్య
ఉండలేను ప్రభూ
భోగ లాలసలనుండి
బౌతిక వాంచలనుండి
రోతల నుండి
రొచ్చు రోదనల నుండి
ఆశ్లీల ఆనందాలనుండి
ఆర్భాటపు అలజడుల నుండి
దు;ఖపు సుడిగుండాలనుండి
బుద్బదప్రాయపు బ్రతుకు నుండి
విముక్తినివ్వు విశ్వహితుడా
అపశృతులు అపస్వరాలు
వినిపించని
నిశ్శబ్దపు
నిశీధిలోనే నన్ను ఉండనివ్వు

నన్ను ఉండనివ్వు

నన్ను ఉండనివ్వు

ఆవలి తీరం చేరా

బంధాలు లేవు
బాద్యతలూ లేవు
విధులూ లేవు
వినోదాలు లేవు
అహాలూ
అంతరాలూ
వ్యామోహాలు
విషవలయాలూ లేవు
ప్రేమలూ లేవు ప్రాణమూ లేదు
ప్రాకులాటలు పోరాటాలు
నటనలూ
నయవంచనలు
వికృతాలు
వెక్కిరింతలూ
ఆశలు ఆరాటాలు లేనే లేవు
చెదిరిన మనస్సులూ
బెదిరే బ్రతుకులు లేవిక్కడ
ఎవ్వరూ లేరు
ఏమీ లేదు
ఒక్కరిగానే
ఒంటరిగానే ఈ ఆవలి తీరం చేరా

ఆవలి తీరం చేరా

ఆవలి తీరం చేరా

నా అనంతునికో అక్షరమాల(ఋ)

ఋషి శ్రేష్టుడివి నువ్వు
ఋషి తుల్యుడా
ఋషి రక్షకుడా
ఋషిపుంగవుడా
ఋతురాజా రవితేజా
ఋతువులకు రంగులు రూపులు అద్దే ఋతుపాలకుడా
ఋషిశ్రేష్టుడా
ఋషీశ్వరా
ఋషులవమన్న గీతాచార్యుడా
ఋషులనే ఇష్టపడే కృష్ణయ్యవు కదా నువ్వు

నా అనంతునికో అక్షరమాల(ఋ)

నా అనంతునికో అక్షరమాల(ఋ)

స్వర్గానందం

చివరి మజిలీ చేరాక
చెప్పేదేముంది
అంబరాన్నంటే ఆనందం హత్తుకుంటుంది
స్వప్నాలన్నీ శకలాలయ్యాక
శ్మశానపు సౌదమెంత సౌందర్యంగా ఉందో
శరీరం శవమయ్యే క్షణాలు
చిదానందాన్ని చేరువ చేసాయి
నరసంచారం లేని ఈ నిశీధి
నిజంగా నజరానానే నాకు
సోలుతూ తేలుతూ
స్వర్గానందాన్ని సొంతం చేసుకుంటున్నా

స్వర్గానందం

స్వర్గానందం

భక్తి అంటే

అన్నింటిలో నిన్ను నువ్వు చూసుకునే స్థితి
నీలో అంతటినీ చూసుకునే స్థితి
నీలోనే దైవాన్ని దర్శించే స్థితి
స్వ పర భావన రహిత స్థితి

భక్తి అంటే

భక్తి అంటే

ఆఖరి మజిలీ

నక్కల ఊళలు
కీచురాయి రాగాలు
గబ్బిలాల గమనాలు
రాబందుల రెక్కల చప్పుడు
మహిషపు గంటల మర్మర ద్వని
జిల్లేళ్ళ బ్రహ్మజెముళ్ళ సహచర్యం
పగిలే కపాలాల కంకాళద్వనులు
కాలుతున్న మాంసపు ముద్దల కమురుకంపు
కమ్ముకున్న కారుమొబ్బుల కటిక చీకటి
నన్ను ఆవలితీరం చేర్చే ఆఖరి మజిలీ ఇదే కదా

ఆఖరి మజిలీ

ఆఖరి మజిలీ

నా అనంతునికో అక్షరమాల(ఊ)

వెన్నెల వనమాలివి

ఊహల్లో
ఊపిరి ఊసుల్లో
ఊరే ఉబలాటాల ఊటల్లో
ఊరించే తీపి రాగాలలో
ఊయలలూగించే మది మలపుల వలపులలో
ఊపిరిపోసే ప్రాణవాయువు కదలికలలో
ఊహాతీత విధి లీలలో
ఊహోపోహల వెల్లువలలో
ఊరేగే నా వన్నెల వెన్నెల వనమాలివి నువ్వు

నా అనంతునికో అక్షరమాల(ఊ)

నా అనంతునికో అక్షరమాల(ఊ)

నా అనంతునికో అక్షర మాల (ఉ)

నువ్వేనని
ఉండలేకున్నా నిన్ను వదిలి
ఉక్కిరి బిక్కిరవుతున్నా నీ ఊహలతో
ఉచ్చ్వాసిస్తున్నా నిరంతరమూ నీ స్మరణను
ఉబలాటపడే వాంచల్లో నిన్ను వీక్షిస్తున్నా
ఉప్పొంగే వేదనలతో వేసారుతున్నా నీకై నిరీక్షిస్తూ
ఉత్సాహం నింపుకుని నువ్వు వస్తావని వేచిఉన్నా
ఉషస్సువై వస్తావని వేకువ వాకిట నిలచి ఉన్నా నీ రాకకై
ఉదయపు వేళల్లో వస్తావని కునుకైనా తీయక కూర్చొని ఉన్నా నీ కోసం
ఉల్లం ఝల్లంటుంది ఏ సవ్వడి విన్నా నువ్వేనని

నా అనంతునికో అక్షర మాల (ఉ)

నా అనంతునికో అక్షర మాల (ఉ)

నా అనంతునికో అక్షరమాల (ఈ)

నా అనంతునికో అక్షరమాల (ఈ)

నా అనంతునికో అక్షరమాల (ఈ)

నా అనంతునికో అక్షరమాల (ఈ)

నా అనంతునికో అక్షర మాల (ఇ)

నా అనంతునికో అక్షర మాల (ఇ)

జాగరణ

జాగరణ

ఎందుకని కన్నయ్యా !!!!!!

నిన్నటి వరకు ఉన్న లోకం మాయమై
కొత్తలోకం ఆవిర్భవించినట్టుగా ఉంది
కనులు మూసినా తెరిచినా కన్నయ్య రూపమే ప్రత్యక్షమై
తన తోడిదే లొకంగా తన తోటే బ్రతుకుగా
ప్రారంభించాలని ముగించాలని
ఒక్క సెకనైనా మిస్ కాకుండా తనతోనే గడపాలని
ఒకే శ్వాసగా
ఒకే స్పందనగా
ఒకే ప్రాణంగా
ఒకే హృదయంలా
ఎప్పుడూ కలసే ఉండాలని అనిపిస్తుంది
రవ్వంత ప్రేమ కూడా అణువంత అనురాగం కూడా
ఎవ్వరికీ దక్కకుండా నాకే సొంతం అవ్వాలనే
కొండంత కోరిక వెళ్ళూనుకుంటుంది ఎందుకని????

ఎందుకని కన్నయ్యా !!!!!!

ఎందుకని కన్నయ్యా !!!!!!

లీనమవుతా ప్రభూ

శ్వాస శ్వాసకూ
స్మరిస్తూ సంగమిస్తూ
నీలో సమాప్తమవుతున్నా
లయ లయ కూ
నిన్ను లాలిస్తూ
లయిస్తూ
నీలో లీనమవుతున్నా

లీనమవుతా ప్రభూ

లీనమవుతా ప్రభూ

నా అనంతునికి అక్షరమాల (అ)

అమృతమయుడవు

అమరుడా
అనంతుడా
అరవిందుడా
అందాలగోవిందుడా
అపురూపపు ఆదిదేవుడా
అడుగు అడుగునా ఆనందమిచ్చే ఆనందవిహారీ
అమ్మైన ఆత్మీయుడా
అనుభూతికందే అల్లరయ్యా
అలసిన మనస్సును అక్కున చేర్చుకునే
అమృతమయుడా !!

నా అనంతునికి అక్షరమాల (అ)

నా అనంతునికి అక్షరమాల (అ)

కనికరించవా

నా పంచ ప్రాణాలూ ప్రసాదంగా ఉంచి ప్రార్ధిస్తున్నా ప్రభూ
తనువూ తపనా
తలపూ తాపమూ
మనసూ మమతా
ప్రేమ పూజా
అనురాగమూ ఆరాధనా
అంతెందుకు నాలో అణువు అణువూ
నీ సన్నిధిలో సేదతీరాలని
తపిస్తున్నాయి జపిస్తున్నాయి
కృష్ణయ్యా కనికరించవా

నా అనంతునికో అక్షర మాల (ఇ)

ఇల లోని నా ఇలవేల్పువి
ఇంగితజ్ఞానానివి
ఇష్టమైన నా ఇష్టసఖునివి
ఇవ్వబడ్డ నా దివ్య వరానివి
ఇజాలులేని నిజస్వరూపానివి
ఇంకిన నా హృదయపరిమళానివి
ఇచ్చతో నాలో ఇముడ్చుకున్న అమృత రూపానివి
ఇంక ఒక్క సెకను కూడా ఇక్కడ ఉండాలని లేదు దేవా
ఇంకెప్పుడన్న నిరీక్షణతో నీరసిస్తున్నా
ఇప్పుడే నన్ను చేర్చుకోవా నీ దగ్గరకు.....

కనికరించవా

కనికరించవా

మౌనగీతం

చెదిరిన గుండెకు
చెలిమివయ్యావు
బెదిరిన బ్రతుకుకి
భధ్రమయ్యావు
అలసిన జన్మకు
ఆధారమయ్యావు
మాటలులేని మనస్సుకి
మననపు
మౌనగీతమయ్యావు

మౌనగీతం

మౌనగీతం

మది చేరవా

నా శ్వాసలో

నువ్వై నిలచిపోవా
నా ద్యాసలో
దగ్గరై దరిచేరవా
నా స్పందనలో
సగమై సాగిరావా
నా కన్నుల్లో
కలవై కలసిపోవా
నా తలపులో
వలపై వచ్చిపోవా
నా మననంలో
మక్కువై మది చేరావా

మది చేరవా

మది చేరవా

ఇవ్వు ప్రభూ

చక్కనయ్యా నీ చెలిమి
చల్లనయ్యా నీ చేరువ
వెన్నెలయ్యా వీడిపోని వెలుగు
వెన్నలయ్యా నీ వలపు
మాధవయ్యా నీ మమత
మురళీధరా నీ మురిపెం
వసుదేవసుతుడా నీ వాత్సల్యం
వంశీకృష్ణా నీ విరహపు విముక్తి
అసుర సం హారకా నీ అనురాగాన్ని
ధరణీపతీ నీ దయను
సమ్మోహనుడా నీ సన్నిధి
కమలనయనా నీ కరుణ
బలరామకృష్ణా బ్రహ్మానందాన్ని
ఇవ్వవా నాకు

ఇవ్వు ప్రభూ

ఇవ్వు ప్రభూ

చెలిమి చెలమవు నువ్వు

మరీచక మనుగడకు వసంతంలా నువ్వొచ్చావు
ఓటమి మనస్సుకు ఓదార్పువయ్యావు
వేదనా గాద్పుకు చల్లని వేదికవయ్యావు
రంగులు లేని అంతరంగానికి
ఆనందపు వర్ణం అలిమావు
విరాగితనానికి వైభోగంలా వచ్చావు
కన్నీరైన కనులకు
కమ్మదనపు కరుణవయ్యావు
ఎండిన గుండెకు చెలిమి చెలమవయ్యావు....

చెలిమి చెలమవు నువ్వు

చెలిమి చెలమవు నువ్వు

ప్రభూ ప్రకృతి పిలుస్తుంది

సుప్రభాత వేళ లో
వినిపించే సహజ సరాగాలు
వీనుల విందైన అద్బుతసప్త స్వరాల సంగీత కచేరీలు
ఎన్ని హొయలో లయలో
ఒక్కో పక్షి గొంతులో ఒక్కో గమకం
ఒక ఆనంద ఆలాపన
ఒక శృతి చేసిన గీతం
కువ కువలు కిన్నెర గానాలు
కల్యాణపు కోకిల కూజితాలు
పేరు తెలియని ఎన్ని పక్షుల తీపి పిలుపులో

జాలువారే మంచుముత్యాలతెరలు
వికసించె విరుల సమూహాలు
పులకించిన ప్రకృతి పలవరింతలు
గిరుల సిరులు
నీలిముసుగేసుకున్న నీలాకాశం

నిన్ను రమ్మని
ఎన్ని స్వాగత సన్నాహాలో
ప్రభూ ప్రకృతి పిలుస్తుంది
రావా మరి
ఈ రంగుల రసజగత్తుకు
ఉదయపు వేళల్లో ఒక్కసారి వచ్చిపోరాదా!!!

ప్రభూ ప్రకృతి పిలుస్తుంది

ప్రభూ ప్రకృతి పిలుస్తుంది

ఇదేగా జీవితం

నాలుగు గోడల కాంక్రీట్ మద్య
కృత్రిమ గాలిని పీలుస్తూ
టెలివిజన్ తెరలకు అతుక్కుపోయి
స్పాంజి ముక్కల్లా ఆశలను చప్పరిస్తూ
మాసిన బట్టల మూటలాంటి శరీరాన్నిమురుస్తూ మోస్తూ
బ్రతికున్న శవాల్లా నిజంకాని బ్రతుకీడిస్తూ
మరమనుషుల్లా మారి
యాంత్రికతతో యాతనపడుతూ
గాలిలో దీపంలా
బ్రతుకెపుడు ఆరుతుందోనని
ఆవేదనపడుతూ
ఈసురోమంటూ
ఇదికాదేమో బ్రతుకనుకుంటూ
బ్రతకడమేగా
ఈ బ్రతుకు ????

ఇదేగా జీవితం

ఇదేగా జీవితం

నిన్ను చేరాలని

నీ ముద్దు మోమును కనలేదని
ముకుళించుకుపోయిన మనస్సుని
వికసింపచేయలేక విలవిల లాడుతున్నా !!!!!

వేద నాదాలలో
నీ ఉనికిని వెతుక్కోలేక
వ్యధతో వాపోతున్నా !!!!!

శిఖర సిం హాసనంపై
ఉన్న నిన్ను చేరుకోలేక
చెమర్చిన కళ్ళతో చిక్కి శల్యమవుతున్నా !!!!

నీ నిశ్వాసంతో నిండిన గాళిని
ఉచ్చ్వాసించాలనుకుంటే
నీ ఊసే వినరాక విస్తుపోతున్నా !!!

అనంతంలో ఉన్న నిన్ను ఆవాహన చేసుకోవాలంటే
అస్పష్టంగా ఉన్న నీరూపానికి
స్పష్టత నివ్వలేక సతమతమవుతున్నా !!!!

నిన్ను చేరాలనే
నిశ్చలత్వం తో నేను మరణించి
శాశ్వత సత్య సమాధిలో
చైతన్యమవుతున్నా !!!!!

నిన్ను చేరాలని

నిన్ను చేరాలని

నరకయాతన

దిక్కుతోచనివ్వని దైన్యం
దుఖ్;సాగరమైన హృదయం
నరకయాతనపెట్టే నైరాశ్యం
పొగిలి పొగిలి ఏడ్వాలన్న వెర్రితనం
అల్లాడే ప్రాణం
అసహాయపు ఆంతర్యం
కన్నులు చెలమలై ఊరుతున్న కన్నీళ్ళు
కదలని కర్కశ కాలం
చెదరి బెదరి
బరువై బెంగై
భారపు బ్రతుకై
ఎడమై ఎడారై
శోకమై శూన్యమై
పొగిలి పొగిలి
కుమిలి కుమిలి
కన్నీరై కల్లోలమై
నిన్ను ప్రేమించిన నేరానికే కదూ
నాకీ నరకమిచ్చావు
ప్రభురాజ్ ప్రాణం వదులుతున్నా
నీ పాదాల చెంత

నరకయాతన

నరకయాతన

విరిమాలను

నా ఎడారి బ్రతుకుకు ఉగాదివి నువ్వు
గుండె గదిలో గుభాళించే గులాబీల గుత్తివి నువ్వు
నీ స్వరార్చనకు స్వాగత గీతాన్ని నేను
నీ పవిత్ర పూజకు ప్రధమ పుష్పాన్ని నేను
నీ అర్పణకే అంకురించిన అదృష్టాన్ని నేను
నా ముకుందునికై
ముకుళిత హస్తాలతో నిలచిన ముగ్దను నే ను
నా మాధవునికై
మాధుర్యం నింపుకున్న మురిపాన్ని నేను
నా మనోహరుని మెడను చేరిన విరిమాలను నేను

విరిమాలను

విరిమాలను

నీ సన్నిధి!!

నీ స్మృతుల స్వర్గంలో
నా సంతోషపు స్వప్నాన్ని సృష్టించుకుంటున్నా
నీ కన్నుల కరుణలో
కడతేరిపోవాలన్న కోరిక నాది
నీ స్నేహపు స్వరాలలో
అపస్వరంలేని అమరగీతంలా
అల్లుకుపోవాలనే ఆశ నాది
మాలిన్యపు ఊసేలేని
వెచ్చని మమతల ఊపిరి నీవు
ఎక్కిళ్ళుపెట్టి ఏడ్చే ఏడ్పు ఎడదకు
స్వాంతనను అందించే సంతసం నువ్వు
నాలో నిరాశల చీకటిని తొలగించిన
నా నిండుజాబిల్లి నువ్వు
చాతక పక్షి లా వేచిఉన్నా
నీ సన్నిధనే స్వాతి జల్లు కోసం!!!

నీ సన్నిధి!!

నీ సన్నిధి!!

వంశీ కృష్ణా !!!!!

వసంతం ఒయాసిస్సు
కలసి వచ్చినట్టుగా

వెన్నెలా వలపూ
ఒక్కసారే కమ్ముకున్నట్టు

ఉషస్సు శరత్తు
వాకిలిలోకి వచ్చినట్టు

ప్రేమా పరిమళమూ
నీ పిలుపురాగమూ పాకినట్టు

మురళీ రవమూ
నీ చరణముల సవ్వడి చేరువైనట్టు గా ఉంది

వచ్చినట్టు వున్నావుగా వంశీకృష్ణా !!!

వంశీ కృష్ణా !!!!!

వంశీ కృష్ణా !!!!!

చందన మలామునై....

మనోకాశంలో స్వయం సహితస్వేచ్చాజీవినై
సమాధి గర్భాన సజీవ దృశ్యాన్నై
ఉన్నత విలువలతో తలదించని హిమనగాన్నై
ఘాఢపు సుషుప్తిలో గాంధర్వ లోకపు గగన కుసుమాన్నై
అక్షర శిఖరాల మద్య ఆగని కరకు కరవాల్లాన్నై
విషపు వలలకు చిక్కని వెలుగుల విహంగాన్నై
నిశ్శబ్ద శాంతి తపోవనంలో విహరించే అపురూప పావురాన్నై
కల్మషమంటని గంగాప్రవాహాన్నై
కసాయితనాన్ని కరిగించే అమృతత్వపు అపరిమిత ప్రేమ భాష్యాన్నై
దౌర్భాగ్యపు ద్రోహాలకు దడపుట్టించే ధీశాలినై
ఆరిపోయిన ఆశలకు ఊపిరిలూదే ఆశల ఒయాసిస్సున్నై
మలినమంటిన మనస్సులను ప్రక్షాళనం చేసే ప్రభాకర కిరణాన్నై
వేదన మనస్సులకు ఓదార్పునిచ్చే సత్యసారాన్నై
చెదిరిన మనసుల చింత తీర్చే చెలిమినై
బెదిరిన బ్రతుకులను బాగు చేసే భాగ్యశాలినై
చిద్రమైన బ్రతుకులను చేరదీసి సేదతీర్చే
చందన మలాం నేను

చందన మలామునై....

చందన మలామునై....

కొట్టు కొట్టు

కొట్టు కొట్టు
కాముక మృగాలను కీచక కాలనాగులను
కావరపు కంసులను కర్కశ శక్తులను
కర్రెత్తి కొట్టు

నరుకు నరుకు
నరాధములను నరరూప రాక్షసులను
నల్లధనపు కుబేరులను నమ్మించి నట్టేటముంచేవారిని
కత్తెట్టి నరుకు

పొడువు పొడువు
పొగరుబోతులను పోకిరీలను ప్రేమంటూ ప్రాణం తీసేవారిని
పరులసొమ్ము దోచే పాలకులను పాశవిక మూకలను
శూలమెట్టి పొడువు

మోదు మోదు
దోచుకునే దళారీలను
దాచుకునే దగాకోరులను
పీడించే పాపాత్ములను
సుత్తెట్టి మోదు

కొట్టు కొట్టు

కొట్టు కొట్టు

అమ్మనయ్యా !!!!!!

నీ మననమనే మధుర సుధారసం గ్రోలుతున్నా

నిన్ను అంతరాన నిలుపుకుని అపురూప ఆనందామృతాన్ని అందుకుంటున్నా
బ్రతుకంతా నీకిచ్చి బ్రహ్మానందాన్ని భద్రపరచుకున్నా
ప్రతి క్షణమూ నిన్ను పూజిస్తూ పరిశుద్ద ప్రేమను పదిలపరచుకున్నా
శరీర భ్రమ ను వదలి అత్మానందాన్ని అనుభూతిస్తున్నా
నన్ను నీకు అర్పించుకుని
అమ్మనయ్యా !!!!

నీకై నేను

ఎదురైన దివ్య వరం నువ్వు

ప్రాణమై నిలచిన పసిడి పసితనానివి
మనస్సు మలచిన మహిమాన్వితానివి
ఆత్మ నిండా అల్లుకున్నది నీవైతే
మనసు ముంగిలి ముందు
నవ్వుతున్న నా నయాగరా జలపాతం నువ్వు
కాలం కోరుకున్న కలనిచ్చి కదలిపోతుంటే
నా స్వప్నపు స్వర్గానికి నిన్ను సృష్టికర్తను చేసా
ఎద నిండా నిండిన వెలుగు పువ్వులతో
పరిశుద్ద ప్రేమ నింపుకున్న పరవశంతో
ఉదయిస్తున్న వెలుగురేఖ
వెండి వెన్నెలనిచ్చి వెళ్ళి పోతుంటే
అంతరాన అమరిన నీ అమృతపు చెలిమిని
జీవనపాత్రలోకి ఒంపుకుని
పునీతత్వాన్ని ప్రోదిచేసుకోవాలని చూస్తూ
కొత్తచిగురు కొమ్మపై
ఎన్నటికీ వాడని వికసిత పుష్పం నీవైతే
వసంతమై విస్తరిస్తా నేను ......

సందడి నువ్వుయితే

సందడి నువ్వయితే
సప్త స్వరాలను ఆలాపిస్తూ
ఆలాపనలలో నిన్ను అనువదించుకుంటూ
సంభ్రమ సంగీతాన్ని మదినింపుకుంటా....

కన్నుల్లో కొలువైన కమ్మని కలలను
కానుకగా ఇమ్మని కోరుతూ
మనో మందిరాన
మురుస్తున్న భావాలను
మురిపెంగా నీకు అర్పించుకుంటా.
హాయినిచ్చే హృదయాన
నీ సజీవ స్మృతులను స్పృజిస్తూ ...

ఒక్కటే రూపం ఒక్కటే మమత ఆత్మను చేరి
అడుగంటిన అంబరపు ఆశలకు ఊపిరిలూది
నిన్న నాటుకున్న అమృత బీజాలకు ఆయువు పోసి
నేటికి జీవ వృక్షమై
తపన పడే నా తపస్సుకి
దివ్య వరమై........

నిర్వేదాన్ని నిలదీసి
నిర్లిప్తతను నెట్టేసి
నిజమై నవ్యమై
నా ఎదుట నిలచి
అపురూప లోకాలకు
అనంతపు బ్రతుకుకు
తోడై నిలచిన
తిమిర సం హారిణివి నువ్వు .......

సందడి నువ్వుయితే

సందడి నువ్వుయితే

ప్రభూ తెలుసా నీకు !!!

నా పిలుపుకు నువ్వు పలకకపోతే
నా ప్రాణం పోతుందని తెలుసా నీకు...
నీ నెరీక్షణలో నా నవనాడులూ
నీరసిస్తాయని తెలుసా నీకు....
నీ సన్నిధినే శ్వాసిస్తూ
నీ చేరువనే స్వీకరిస్తూ
స్పందిస్తున్నానని
సజీవంగా ఉన్నానని తెలుసా నీకు....
తనవితీరని నా ఒంటరి తలపులకి
తీపిపరిమళం నీవని
నా భారపు బ్రతుకుకి
తేలికదనమిచ్చే చల్లని తమ్మెర
నీవని తెలుసా నీకు........!!

ప్రభూ తెలుసా నీకు !!!

ప్రభూ తెలుసా నీకు !!!

మధువనిలో మాధుర్యం

సుప్రభాత వేళలో
పుడమిపై జాలువారే మంచుముత్యం నువ్వు
ఉదయపు వాకిలిలో
విచ్చుకున్న విరజాజివి నువ్వు
వెన్నెల లోగిలిలో
విరబూసిన సన్నజాజివి నువ్వు
తెలిమబ్బుల పానుపుపై పవళించిన
పేరుతెలియని వెండివెన్నెల వీనస్ నువ్వు
చ్హీకటి వేదనలను వెల్లగొట్టే
భానుని తొలి కిరణం నువ్వు
పరమాత్ముని చెంత పరవసించే
పవిత్ర పారిజాత పరిమళం నువ్వు
ధరిత్రినంతా దీవించే దివ్య వరం నువ్వు
ఆత్మీయపు అమృతం నువ్వు
అల్పత్వానికి అందని అపురూపం నువ్వు
తన వెలుగుతో తమస్సును తొలగించే
భానుని బంగారు పుత్రిక నువ్వు
తుషార బిందువులు నిండిన తెల్ల గులాబి నువ్వు
చీకటి నీడలు చేరని
చల్లని చందమామ నువ్వు
మాధుర్యపు మమకారాన్ని
మనసున ఉంచిన మధువని నువ్వు

మధువనిలో మాధుర్యం

మధువనిలో మాధుర్యం

అమ్మ

అమ్మ అవనికి అపురూపం
అమృతపు భావనకు ఆదిమూలం
అమ్మతనమే అఖిల జగతికి ఆధారం
ఆడదంటే అమ్మతనం అదే సృష్టికి సుధా రసభరితం
అమ్మ కన్నీటికి ఎవరు కారణమైనా
కొట్టుకు పోతారు కానరాకుండా
అమ్మ దైవపు ఉనికికి ఒకే ఒక్క ఆధారం
అమ్మే లేకుంటే అవనే ఉండదేమో
తీపిదనమంతా అమ్మే.....

అమ్మ

అమ్మ

పాడుతున్నా నీ ప్రేమ గీతాన్ని....!

తలపు తలపునా తరిస్తూ
పిలు పిలుపులో పులకిస్తూ
శ్వాస శ్వాసకూ నిన్ను స్వాగతించుకుంటూ
అడుగు అడుగునా నిన్నే అనుసరిస్తూ
ఆలాపనలలో అర్పితమవుతూ
అనుభూతి అనుభూతికి అంకితమవుతూ
మాటి మాటికీ నిన్ను మననం చేసుకుంటూ
నాలోని అణువు అణువునా నిన్నే అనుకుంటూ
నా గుండె ప్రతి స్పందన కూ నిన్నే స్మరించుకుంటూ
సెకను సెకనుకూ నిన్నే స్వరార్చన చేసుకుంటూ
పాడుతున్నా ప్రభూ నీ ప్రేమ గీతాన్ని...

పాడుతున్నా నీ ప్రేమ గీతాన్ని....!

పాడుతున్నా నీ ప్రేమ గీతాన్ని....!

నిన్ను స్వాగతించుకుంటున్నా !!

ప్రణయపు ప్రియ రాగాలలో

పురివిప్పిన పులకింతలలో
పరవశపు ఝరులలో
ప్రవహించే ప్రేమ జలల
జీవ నదుల అలల లయలలో
లయించిన రంజిత రాగాల రమ్యాలాపనలలో
మదిపాడే మనసైన స్మరణ సరాగాలలో
స్పష్ట పరచుకున్న
నా సుందర స్వాప్నికుడా
నిన్ను స్వాగతించుకుంటున్నా
నా మదిని బృందావన మందిరం చేసి.....

నిన్ను స్వాగతించుకుంటున్నా !!

నిన్ను స్వాగతించుకుంటున్నా !!

కరుణించవా కన్నయ్యా!!!!!!

నా పిలుపులో ప్రాణముంచుకుని
ప్రేమ నింపుకుని
పిలుస్తున్నా ప్రభూ
పలకవా....?

అణువు అణువునా
ఆరాధనుంచుకుని
ఆవేదన అలుముకుని
అడుగుతున్నా
ఆలకించవా...?

కన్నుల నిండా నిన్నుంచుకుని
కన్నీరు కార్చుకుని
కోరుతున్నా
కరుణించవా కన్నయ్యా......?

కరుణించవా కన్నయ్యా!!!!!!

కరుణించవా కన్నయ్యా!!!!!!

ప్రవేశించాలని

హృదయములోని వెలితిని వెళ్ళగొట్టలేక

నిన్ను వదిలి ఉండలేక
మౌనాన్ని మోయలేక
మరణిస్తున్నా ప్రభూ
నీ పాదాల చెంత ప్రవేశించాలని

ప్రవేశించాలని

ప్రవేశించాలని

తోడై నిలిచావు;..

అలుపొచ్చిన అణువులకు ఆలాపనయ్యావు

అనంతకాలపు ఆత్మను ఆదుకునే ఆసరా వయ్యావు
ఊరించే ఊహలకు ఊతమయ్యావు
అలవికాని ఆరాటాలకు ఆధారమయ్యావు
ప్రార్ధించుకున్న ప్రాణానికి పిలుపువయ్యావు
ద్యానపు దాహానికి ధన్యతనిచ్చావు
సతతపు స్మరణకు సొంపుదనమిచ్చావు
నిరంతర నిరీక్షణకు నా నీడవై వచ్చావు
తొందరపడిన తపనలకు తోడై నిలచావు

తోడై నిలిచావు;..

తోడై నిలిచావు;..

నీ చరణముల చెంత

ఉండనన్నానా నీ వాకిలిలో

లేనన్నానా నీ లీలలలో
ఆగనన్నానా నీ ఆవరణలో
కదలనన్నానా నీ కమలపు కన్నులలో
చేరనన్నానా నీ చరణముల చెంత......

నీ చరణముల చెంత

నీ చరణముల చెంత

అనుమతించవా ప్రభూ

నా ఆకాంక్షే నీ ఆవిష్కరణ

నా నమ్మకంలోనే నువ్వుంటావు
నా నిరీక్షణలోనే నిలిచుంటావు
నా హృదయస్పందన లోనే సాగుతుంటావు
నా శ్వాసే నీ సహచర్యం
దృశ్య అదృశ్యాలలో దోబూచులాడే
నా దొంగ కన్నయ్యవు నువ్వు
అస్పష్ట స్పష్ట స్వరూపాలతో అల్లరి చేసే
అల్లరి వాడివి నువ్వు
మనసుని మదువనిలోకి మళ్ళించే
మధుర మురలీధరుడివి
ప్రాణం అల్లాడుతుంది నీ కోసం
అనుమతించవా ప్రభూ.....

నేను నువ్వయ్యానా

ప్రేమ పరిష్వంగాలలో

స్పురణల స్మృతుల సంకలనాలలో
గుండె లయలలో
ఉచ్చ్వాస నిశ్వాసలలో
శ్వాసల ద్యాసలలో
నిరంతర అంతర ఆలోచనలలో
ప్రతి అణువు అణువులో
కదులుతున్న రక్త ప్రవాహాలలో
దేహాలలో మోహాలలో
వాంచలలో వాస్తవాలలో
నిరంతరమూ కదులుతూ మెదులుతూ
ఉన్న నిన్ను
నాలో అంతా నింపుకున్నానేమో
నడుస్తున్న నల్లనయ్యను
నేనేమో అనిపిస్తుంది....

నేను నువ్వయ్యానా

నేను నువ్వయ్యానా

అంకితమయ్యా

నీ

దివ్యపు స్మరణలో
దన్యమవుతూ

నీ
స్మృతులను స్పర్శించి
సజీవమవుతూ

నీ
సన్నిధి స్పృజించి
స్వర్గమవుతూ

నీ
ప్రేమను ఒంపుకుని
ప్రాణాలు నిలుపుకుని

నీ
ఊహలను హత్తుకుని
ఊపిరి ఉంచుకుని

నీ ఎడబాటులో ఏడ్చే ఎడదను
ఓపిగ్గా ఓదార్చి
నీకే అంకితనై
అలమటిస్తున్నా
నిన్ను అందుకోవాలని...

అంకితమయ్యా

అంకితమయ్యా

చేరనివ్వు

నీ చింతలోనే
నీ చెంతలోనే
నీ చిత్తములొనే
నీ చింతనలోనే
నీ చిరు నగవులోనే
నీ చెలిమిలోనే
నీ చేరువలోనే చేరనివ్వు

చేరనివ్వు

చేరనివ్వు

నిరంతరమూ

ఒక్క సెకను కూడా
నిన్ను స్మరించకుండా
సాగలేను సర్వేశ్వరా

ఒక్క జామైనా
నిన్ను జపించకుండా
జీవించలేను జగన్నాధా

ఒక్క నిమిషమైనా
నిన్ను నాలో నింపుకోకుండా
నిలువలేను నీలాంబరా

ఒక్క ఘడ్యైనా
నీ గీతాన్ని ఆలాపించకుండా
గడపలేను గంగాధరా

ఒక్క దినమైనా
నిన్ను ద్యానించకుండా
దారితప్పనివ్వను దీనబంధూ

అరసెకనైనా
నిన్ను ఆలాపించకుండా
ఆగలేను అమరేశ్వరా

సతతమూ
మదివనాన
మనన మాధుర్యాలను
పరవశపు పరిమళాలను
స్మృతుల సోగంధికా పుష్పాలను
సృష్టించుకుంటూ
నీ లీలల లాలనలో
నీ ఆలాపనల ఆస్వాదనలో
తరిస్తున్నా
నిరంతరమూ

నిరంతరమూ

నిరంతరమూ

గీతాచార్యుడివి

స్వాగతించుకున్న సన్నిధివి

స్వప్న సురాధిపతివి
ప్రశాంత చిత్తానికి ప్రభు రాజ్ వి
పల్లవించే ప్రేమలకి ప్రియాధిపతివి
చీకటైన చిత్తాలకి చక్కనైన చందమామవు
అలమటించే అంతరంగాలను
ఆదరించే ఆశావహుడివి
ఆత్మ భావనను
అందించే అంతరంగాధిపతివి
చంచల మనస్సులను
స్థిరపరచే స్థిరచిత్తుడివి
శోకాలను శాంతపరచే
శాంతిధాముడివి
గతి తప్పిన బ్రతుకులను గాడినపెట్టే
గీతాచార్యుడివి......

గీతాచార్యుడివి

గీతాచార్యుడివి

నువ్వు నాతోనే

ఊపిరిలో ఊహలలో
స్పందనలో శ్వాసలో
నీడలో తోడులో
మాటలో మనసులో
కలలలో కలతలలో
ఆశలలో ఆనందాలలో
అలసిన అలసటలలో
ఆరాటపు ఆలోచనలలో
అడుగులలో అనుసరణలలో
అణువులలో అమరికలలో
అందమైన ఆలాపనలలో
నేనంతా నువ్వే
నువ్వూ నాతోనే

నువ్వు నాతోనే

నువ్వు నాతోనే

సజీవమవుతా

నీ అస్తిత్వపు అంచుల్లో చేర్చుకోమని

అలసిన ఆత్మ అడుగుతుంది
ఏకాత్మలా
నీ ఎదలోపలి అణువులలోఅమరుతానంటుంది
నీ శ్వాసలో చేరిపోయి వాయులీనమై
ఒదుగుతానంటుంది
ముత్యమై మురిపమై మోక్షమై
నీ మానస మురళినై మ్రోగుతానంటుంది
అర్పితనై
ఆశ్రితనై
ఆరాధకురాలినై
నీ సాన్నిద్యంలో
నీ సానిహిత్యంలో
సర్వస్వాన్ని సమర్పించుకుంటున్నా
నీ సన్నిధనే స్వర్గం లోనే
సంపూర్ణమవుతూ
సజీవమవుతా........

సజీవమవుతా

సజీవమవుతా

మనుగడ సాగిస్తున్నా

వియోగమనే దు;ఖపు ఊబిలో దూరిపోయా
అనంతపు అశృ మేఘాలలో మిళితమయ్యా
తిమిరపు తీరాలలో తల్లడిల్లుతున్నా
ఒంటరి ఎడారిదారుల్లో ఏకాకిలా ఎదురు చూస్తున్నా
విషాద వలస విహంగంలా వెళ్ళలేక వేదనవుతున్నా
భారపు బ్రతుకును మోయలేక బెంగపడుతున్నా
తనవి తీరని తీరాల వెంట తిరుగుతూ తపనపడుతున్నా
అడుగంటిన ఆశలను అందుకోలేక అల్లాడుతున్నా
వెళ్ళిపోయే వ్యర్ధపు క్షణాలను వెర్రిగా చూస్తున్నా
కలల కరుకు కత్తి కసి గా కోస్తుంటే
రక్తాశృవునై రాలుతున్నా
నీ జాడలేక జన్మను జారవిడుచుకుంటున్నా
తేనెలూరు నీ తలపులను తలచుకుంటూ
మూటకట్టుకున్న కొన్ని మధుర క్షణాలను
మననం చేసుకుంటూ
మనుగడ సాగిస్తున్నా

మనుగడ సాగిస్తున్నా

మనుగడ సాగిస్తున్నా

వచ్చేస్తా!!!

ఆశల పాశాలను

ఆవేదనా వలయాలను
ఇంద్రియానందాలను
ఈ లోకపు బౌతికాలను
ఊహల వెల్లువలను
హృదయపు వ్యధలను
ఒంటరి రొదల రోదనలను
కలల కల్పనలను
గతపు గురుతులను
బంధపు బ్రతుకును
అన్నీ అన్నీ
వదిలేసి వచ్చేసి
నీ తలపుల తలుపులను
తెరిచి ఉంచాను ప్రభూ
విచ్చెయ్యి వేగంగా
విచ్చేస్తాను వనమాలీ నీతో...

వచ్చేస్తా!!!

వచ్చేస్తా!!!

వచ్చిపోవుగా

వచ్చిపోవుగా

వచ్చిపోవుగా

కన్నయ్యా

కలవరింతకూ కరగవు
కన్నీటికీ కదలవు
పిలిచినా పలకవు
ప్రార్ధించినా ప్రత్యక్షమవవు
ప్రేమించినా పట్టించుకోవు
ప్రాణంపోతున్నా పరిగెత్తుకురావు
నీ సన్నిధికై సాగిలిపడ్డా సాక్షాత్కరించవు
ఎదల సొదలను ఎన్నిమార్లు ఎరుక పరచినా
ఎరగనట్టే ఏడ్పిస్తావు
వెన్నెల నింపుతావని
ఏండ్లతరబడి వేచి ఉన్నా
వెలతి పెట్టావే కాని వచ్చిపోవుగా.....

నా గమ్యం

సర్వస్వమని స్వాగతించుకుంటూ
ప్రాణమని శ్వాసిస్తూ
స్మరణమని స్మరిస్తూ
మననమని మనుగడ సాగిస్తూ
ధర్మమని ద్యానిస్తూ
ప్రియమని ప్రేమిస్తూ
దూరమని భారమవుతూ
ఊహిస్తూ ఊపిరి పోసుకుంటూ
ఊసులాడుకుంటూ
పిచ్చిదానిలా ప్రాకులాడుతూ
నాలో నేను నీతోనే
మౌన సంప్రదింపులు జరుపుకుంటూ
నీ సన్నిధినే స్మరిస్తూ
బ్రతుకుతున్నా నువ్వే నా గమ్యమని

నా గమ్యం

నాలో నీతో

పొగచూరిన జీవితాలను
ప్రజ్వలింప చేసే ప్రభాకరుడా
పశుతుల్య జీవనం నుండి
పారమార్ధిక వైపు మళ్ళించే
పరమ ప్రభూ
వెలుగుల కోసం వెతుకులాడే
వ్యధాభరితహృదయులకు
అపరిమిత ఆనందామృతాన్ని
అందించే అనంతానందుడా
ఆశాపాశాల పతంగుల వెంట
పరుగులెత్తే పామరులకి
ప్రశాంత చిత్తాన్ని
ప్రసాదించే పావనుడా
ప్రభూ నిన్ను కనుగున్నాగా
ఇంక ఆలస్యమెందుకు
అరక్షణమైనా
ఆయువుతో అల్లాడాలనిపించడంలేదు
నీ ఉనికిలో
నీ ఊపిరిలో
నీలో నీతో

నాలో నీతో

దివ్యానందానికి

నేను నా దృష్టిని

ఓటమినుంచి విజయంవైపుకు
బానిసతనం నుంచి యజమానత్వం వైపుకు
వైపల్యమ్నుంచి సాఫల్యానికి
భయం నుంచి నిర్భయత్వానికి
అలజడినుంచి ప్రశాంతతకు
మన;చాంచల్యం నుంచి ఏకాగ్రతకు
అశాంతి నుంచి శాంతికి
శాంతి నుంచి లోపలి
దివ్యానందానికి మరల్చాలి

నల్లనయ్యా

దిగులు మేఘం కమ్ముకున్నప్పుడు

ఓదార్పు వర్షమై వర్షిస్తావు

వేదనల వడగాడ్పు వేటాడుతుంటే
సంతోషపు ఒయాసిస్సువై స్వాంతనపరుస్తావు

ఒంటరితనపు గుబులుతనం
గుండెల్లో గూడు కట్టుకున్నప్పుడు
జంటగా నేన్నున్నానంటూ
జతపడే జల్లువై జవాబిస్తావు

అహంకారపు మనుషులెవరూ ఆదరించకున్నా
అపురూప వరమై అక్కున చేర్చుకుంటావు

నిజ్జం నల్లనయ్యా
నువ్వు ఉన్నావన్న ఊహే ఊపిరిపోస్తుంది......

నల్లనయ్యా

నువ్వయ్యాక

తరలిపోనుగా......తీరమయ్యాక

చింతలేదుగా....చేరువయ్యాక
కలతలేదుగా....కలవయ్యాక
సాగలేనుగా...శ్వాసవయ్యాక
ఉండలేనుగా...ఊపిరివయ్యాక
బ్రతకలేనుగా....ప్రాణమయ్యాక
మనలేనుగా...మనుగడవయ్యాక
గడపలేనుగా....గమనమయ్యాక
మరుపులేదుగా.....మననమయ్యాక
వీడలేనుగా...వేయిజన్మల బంధమయ్యాక
వదలలేనుగా....వాస్తవమయ్యాక
శోకం లేదుగా...సొంతమయ్యాక
నేనులేనుగా....నువ్వయ్యాక

నువ్వయ్యాక

అర్పితను

నా పదలయలలో పరవశించు ప్రభూ
జీవపు శ్వాసలలో జాలువారు జనార్ధనా
నిరంతర నా స్మరణలలో సేదతీరు సర్వేశ్వరా
నా హృదయ స్పందనలలో స్థిరపడిపో సృష్టికర్తా
నా కన్నులలో కొలువై ఉండు కృష్ణదేవా
నిత్యకర్మలలో నిమగ్నమవు నిర్మలానందా
అంతరాలలో అణువణువునా
అమరివున్న అమరేశ్వరుడా
నీనుండే అంకురించిన నేను
నీకే అర్పితమవుతా!!!!!!!!!!

అర్పితను

మౌనగీతాన్ని

మౌనగీతాన్ని

నిన్ను తాకే గాలిని అంటిన

చల్లని సుగంధాన్ని

నీ పదకమలముల కడ
ప్రభవించే ప్రసూన పరిమళాన్ని

నీ కలువ కన్నులను తాకే
నునుమెత్తని జాబిలి కిరణాన్ని

నీ మనోమందిరములో
కరుగుతున్న కర్పూర హారతిని

నీ వీనులను చేరే
బంగారు మువ్వల మురిపెపు మధుర రవళిని

సదా నిన్ను స్పర్శించే
నీ మురళిని తాకే చిరు వాయు తరంగాన్ని

నీ ముంగిటమ్రోగే
ముగ్ద మోహన మౌనగీతాన్ని ....

చిదానందా

చిత్త వృత్తులలో
చెలిమి చేరువులలో
అచేతనా చేతనలలో
అపరిమిత పరిమితులలో
లోపల వెలుపలా
భావ బాందవ్యాలలో
భాదల బరువులలో
ద్వైత అద్వైతాలలో
ఉచ్చ్వాస నిశ్వాసాలలో
ప్రణవ ప్రళయాలలో
ఇహ పరాలలో
చేరిన
చిదానందుడా
నిన్ను చేరడానికి
చితికైనా చేరిపోతా

చిదానందా

చిదానందా

కన్నయ్యా

బెంగ లేదుగా.....బ్రతుకయ్యాక
మరువలేదుగా... మధురమయ్యాక
దూరం లేదుగా....దగ్గరయ్యాక
వేదనలేదుగా...ఒక్కటయ్యాక
వాంచ లేదుగా.... వరమయ్యాక
ఆగిపోయాగా....అందుకున్నాక

కన్నయ్యా

బృందావన తీరం

వద్దనవుగా వనమాలీ

ఊపిరివై
వాంచవై
కనుల అలలపై అడుగిడిన
నా కన్నయ్యా
పొంగిపొరలే వేదనా ప్రవాహంలో
ఈదులాడే నేను
బృందావన తీరానికి
త్వర త్వరగా చేరాలని
వడి వడిగా వస్తున్నా
వద్దనవుగా వనమాలీ

బృందావన తీరం

మానవ ధర్మం

కష్టసుఖాల సమ్మేళనమైన జీవితాన్ని
స్తిరచిత్తముతో ఆహ్వానించి అంగీకరించి
ఆ జీవితాన్ని పండించుకోవడం
ఉదాత్తమైన మానవ ధర్మం

ఆశ్రయిని

వాక్కులకు వ్యాఖ్యలకు
అందని ఆనంద స్వరూపుడివి
కాంక్షా రహిత కన్నయ్యవి
తడబాటే లేని నా తండ్రీ
చరమసత్యపు చివరి స్వాంతనా సంగీతపు
సొంపుదనం నువ్వు
మనుషుల మానసిక జాడ్యాలకు
మమతల మలాం రాసే మనోహరుడివి
సుప్రతిష్టురాలినై
శ్యామసహిత సంత్రుప్తురాలినై
నిన్ను ఆరాధించే నీ ఆశ్రయిని

ఆశ్రయిని

ఆశ్రయిని

నువ్వు కావాలి

అనుబందాలన్నీ ఆర్దికమైనవే

స్నేహాలన్నీ స్వార్దమైనవే
బందాలన్నీ శారీరకమైనవే
తనువు మనస్సు బ్రతకడంలో విసిగిపోయాయి
జీవనరాగం అపస్వరమైంది
జ్వలించిన కాలమంతా
కాల్చేసింది ఆశల్ని సమిధలుగా చేసి
వెన్నెలనూ వేడుకున్నా
పువ్వుల్నీ ప్రాదేయపడ్డా
సాగరాన్ని
ఎవరెస్టుని
ఆకాశాన్ని
అనంతాన్ని అమ్మవారిని
పక్షినీ పునుగునూ
శుకాన్ని పికాన్ని
చెట్టును పుట్టను
ఏటినీ పాటను
ఈశ్వరుని ఇంద్రదనస్సునూ
కొండను కోకిలనూ
వసంతాన్ని హేమంతాన్ని
దేవుడినీ దేహీ అన్నా
కృష్ణశాస్త్రికీ కబురంపా
రవీంద్రునీ రాల్చమన్నా
ఆత్రేయనూ అబ్యర్దించా
క్రీస్తునీ కనికరించమన్నా
బుద్దునీ బ్రతిమాలా
పాలపుంతనూ పరంధాముని
ఒక్కదాన్నే ఓడిపోతున్నా
ఒంటరిగా ఉండలేకున్నా
మీరందరూ కలసి
ఒక్క మనిషిని కాదు కాదు
లింగాలు గుణాలూ
ఆకారం అహంకారమూ
వికారమూ వాంచలూ
భేదాలు ఖేదాలు
మతాలు మౌడ్యాలు
కుళ్ళు కుత్సితమూ లేని
ఒక్క ఆత్మను నాకిమ్మని
నాకో నేస్తం కావాలని అడిగాను

చిన్ని కృష్ణుడు

చిన్ని కృష్ణుడు

చిన్ని కృష్ణుడువి

మనసు లోలోపలి పొరలలో
మమతల మురిపెపు పొదలలో
కలల కనులకు కనిపించిన కన్నయ్యా
పరుగులకు తరుగులకు
అలసటకు అశాంతికి
అందిన ఆత్మీయుడవు
ఆత్మ అనువదించుకున్న అంతరంగ అధిపతివి
చింతలకు చీకాకులకు చిక్కిన
చిదానంద స్వరూపుడవు
నా చిత్తము లో చేర్చుకున్న
చిన్నికృష్ణుడవు .....

నీ స్మృతిలో...

నీ జ్ణాపకాలు మళ్ళీ మళ్ళీ

ఊపిరిపోసుకుని జీవిస్తున్నాయి
కళ్ళల్లో అనుక్షణమూ
కదలాడే నీ రూపం
ఆగకుండా కారే కన్నీరులో
కలసి కరిగిపోతుంది
అలలా జారిపోయిన నిన్ను
నాలోనే నింపుకోవాలన్న తపనతో
కనులు మూద్దామన్నా
కనురెప్పల మాటున దాగి
నిండిన దు;ఖం
నిద్రనూ దూరం చేస్తూ..
నిన్నుని నా అణువు అణువూ నింపుతుంది.
వాస్తవం నిన్ను దరిచేర్చకున్నా
నా ఊహలు నిన్ను దగ్గర చేస్తున్నాయి
నా జన్మకు తోడుగా నిలచి
నా దు;ఖాన్ని ఏమార్చి
నా ఎన్నంటి నిలచిన నిన్ను
నాలో ఇముడ్చుకుని
నీకు చెప్పిన నా అంతరంగిక రహస్యాలను
నిన్ను అనుసరించి అనుభూతించిన
అరుదైన క్షణాలను అనువదించుకుంటూ
నీ స్మరణలను స్పర్శించుకుంటూ
సజీవమవుతున్నా........

శ్వాసిస్తున్నా

నాలో నిన్ను
ఆవిష్కరించుకుంటున్నా ఆత్మవిశ్వాసంతో

అనంతమైన నిన్ను చేరడానికి
ఒక్క ప్రేమ భావం చాలదా

భక్తితో నిన్ను పిలవడానికి
నా పసిపాప మనస్సు పనికొస్తుందిగా

వాసంత సమీరానివి నువ్వు
నిన్ను చేరడానికి చెలిమి శీతలపవనమైతే చాలుగా

శూన్యపు అంతరాన
తనవితీరని తేనలూరు తీపిఊసులే నీతో

నీతో కలసి విహంగ విహార వీక్షణాలు
అద్భుత అమరలోక పయనాలు

అవ్యక్త అవర్ణ అనుభూత పద మాలలను అల్లి
నీ పద సన్నిధిలో పదే పదే అర్పిస్తున్నా

నీ నా ఆత్మల ఐక్యతకు
ద్యాన వారధిని వేసుకుంటున్నా

నాలోని నిన్నును
నిరంతరమూ దర్శిస్తూ స్పర్సిస్తున్నాను

నిన్ను స్వాగతించడానికి
నాలోని చెత్తనంతా ఊడ్చేసాను

నీ జ్ణాపకాలతో నింపుకోవాలనే
గతపు జాడలను మరుపులోతుల్లోకి జార్చేసాను

యశోదమ్మలా నిన్ను
అక్కున చేర్చుకోవడానికి ఆరాటపడుతున్నాను

శాపాలను శ్లోకాలుగా మార్చే
శశి వదనుడా
నే శ్వాసిస్తున్నా
నీ సన్నిధికై......

శ్వాసిస్తున్నా

శ్వాసిస్తున్నా

సత్యమైన నా సొంతానివి

సత్యమైన నా సొంతానివి

సత్యమైన నా సొంతానివి

నా అంతరాంతరాలలో అడుగు నిలిపిన

అంతర్యామీ
నా అంతర్వాణిని వినలేవా
నాలోని నా నువ్వువే
నన్నుని నా నుంచి నిరసించలేవా
ఇక్కడ ఏదీ నాసొంతం కాదు
నువ్వు
నువ్వు మాత్రమే
నా సత్యమైన సొంతానివి....

వద్దనకు....

వద్దనకు....

వద్దనకు....

అనుసరిస్తూ అనుమతిస్తూ
అలమటిస్తూ అర్పణనవుతూ
ఆరాధిస్తూ ఆలోచిస్తూ
ఆక్రోసిస్తూ ఆక్రందిస్తూ
ఆలాపిస్తూ ఆశ్రయిస్తూ
కలతపడుతూ కన్నీరవుతూ
కాంక్షిస్తూ కలవరిస్తూ
లయిస్తూ లాలిస్తూ
ద్యానిస్తూ దన్యమవుతూ
పలకరిస్తూ పల్లవవుతూ
ప్రేమిస్తూ పరిభ్రమిస్తూ పరితపిస్తూ
ప్రార్ధిస్తూ ప్రాణమిస్తూ
స్పందిస్తూ స్వప్నిస్తూ
స్మరిస్తూ శ్వాసిస్తూ
శూన్యమవుతూ శోకమవుతూ
అశృవవుతూ అడుగుతున్నా ప్రభూ
నేను అంతమై నీలో ఆరంభమవుతానని!!!!!!!!

2, ఏప్రిల్ 2015, గురువారం